AMARAVATHITECHNOLOGY

భారతీయలు సమాచార విప్లవంలో ప్రపంచానికి మార్గదర్శిగా ఉన్నరు-ప్రధాని మోదీ

అమరావతి: 100 కోట్ల మొబైల్ ఫోన్స్ ద్వారా భారతీయలు సమాచార విప్లవంలో ప్రపంచానికి మార్గదర్శిగా ఉన్నరని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..బుధవారం ఢిల్లీలో ఇండియా 6G విజ‌న్ డాక్యుమెంట్‌ని ఆవిష్క‌రించారు..6G (రీసెర్చ్‌ సెంటర్‌ను) R&D టెస్ట్ బెడ్‌ను,,‘ Call before you dig’ Appను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు..ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించారు.2028-29 నాటికి భారత్‌లో 6G సేవలు అందుబాటులోకి వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.. గ్లోబల్‌ సౌత్‌ సమిట్‌ను భారత్‌ విజయవంతంగా నిర్వహించిందన్నారు..భారత్‌లో చాలామంది ప్రజలు నేడు కొత్త ఏడాది వేడుకలను జరుపుకుంటున్న సందర్బంలో 6G రీసెర్చ్‌ సెంటర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.. అతితక్కువ ధరకే భారత్‌లో డేటా లభ్యమవుతోందన్నారు.. పట్టణాల ప్రజలే కంటే గ్రామాల్లో ఇంటర్నెట్‌ వినియోగదారల సంఖ్య భారీగా పెరిగిందన్నారు..దేశంలో 2 లక్షల గ్రామాలకు ఆప్టికల్‌ ఫైబర్‌ సేవలు అందాయని చెప్పారు..దేశంలో బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారులు కోట్ల సంఖ్యలో పెరిగారని అన్నారు..సమాచారం రంగంలో ప్రపంచదేశాలు,భారత్ ను విస్మరించలేని స్థాయిలో దేశం వుందన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *