INTERNATIONAL

“భారత ఆర్థికవ్యవస్థ” బ్రిటన్ కంటే మెరుగ్గా ఉంది-IMF నివేదిక

అమరావతి: కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు,వృద్ధిరేటు పడిపోవడంతో చాలా వరకు క్షిణించాయి.భారత్ లో కూడా లాక్ డౌన్ కారణంగా వివిధ రంగాలు భారీ నష్టాన్నే చవిచూశాయి..అయితే కోవిడ్ అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టేందుకు కేంద్రప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యలు కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిలోపడుతోంది. ముఖ్యంగా ఎగుమతులను పెంచి, దిగుమతులను తగ్గించుకోవడం ద్వారా కోవిడ్ కారణంగా క్షీణించిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు చేసిన ప్రయత్నాలు సానుకూల ఫలితాలను సాధిస్తున్నాయి.. తాజాగా ఇంటర్నేషనల్ మానీటరీ ఫండ్-IMF నివేదిక ప్రకారం “భారత ఆర్థికవ్యవస్థ” బ్రిటన్ కంటే మెరుగ్గా ఉన్నట్లు పేర్కొంది..ప్రపంచ దేశాలతో పోటీపడుతూ.. పెద్ద దేశాల ఆర్థిక వ్యవస్థలకు ధీటుగా నిలుస్తూ గట్టిపోటీనిస్తోంది. అగ్రదేశాలైన అమెరికా, బ్రిటన్, చైనా వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు క్రమంగా క్షిణిస్తుండగా,, భారత ఆర్థిక వ్యవస్థమాత్రం నిదానం పైకి ఎగబాకుతొంది..భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఈఏడాది 7% నికి మించి ఉంటుందని IMF అంచనావేస్తోంది.బ్రిటన్ కంటే భారత్ మెరుగైన స్థానానికి చేరుకుని ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. GDP పరంగా భారత ఆర్థిక వ్యవస్థ బ్రిటన్ కంటే మెరుగ్గా ఉంది.. ఇప్పటివరకు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న బ్రిటన్ ఆస్థానాన్ని కోల్పోయి 6వ స్థానంలో కొనసాగుతోంది.IMF గణాంకాలు ప్రకారం 2021 డిసెంబర్ నాటికే భారత ఆర్థిక వ్యవస్థ ఈస్థాయికి చేరుకుంది. ఈ సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత ఎదిగి 85,407 కోట్ల డాలర్లకు చేరుకుంది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 81,600 కోట్ల డాలర్లతో, భారత్ తరువాతి స్థానంలో ఉంది. అమెరికా, యూరప్, చైనా, జపాన్ వంటి దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా.. భారత్ మాత్రం తన వృద్ధిరేటును మెరుగుపర్చుకుని ఐదో స్థానానికి ఎదగడం దేశ ఆర్థిక రంగంలో శుభసూచికంగా భావించవచ్చు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *