పాకిస్థాన్, చైనాలు సరిహద్దుల్లో ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులు

అమరావతి: భారత్ కు ప్రధాన సరిహద్దు శతృ దేశాలైన పాకిస్థాన్,, చైనాలు సరిహద్దుల్లో సమస్యలను సృష్టిస్తునే వున్నాయి..వీరిని ధీటుగా ఎదుర్కొవాలంటే అత్యధునిక ఆయుధ వ్యవస్థలు సరిహద్దుల్లో మోహరించాల్సి వుంటుంది.. ఇప్పటికే భారత్ అమ్ముల పొదిలో శక్తివంతమైన ఆయుధాలు వున్నప్పటికి,, వీటికి తోడుగా సాయుధ బలగాల కోసం 120 ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులను కొనుగోలు చేయాలని రక్షణ శాఖ అత్యున్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకొవడమే కాకుండా క్షిపణుల కొనుగోలుకు ఆమోద ముద్ర వేసింది..D.R.D.O సొంతంగా తయారుచేస్తున్న ఈ క్షిపణులు 100 కి.మీ.నుంచి 500 కి.మీటర్ల లక్ష్యాలను ఛేదించగలవని రక్షణ శాఖ వెల్లడించింది.ఈ క్షిపణులు సరిహద్దుల్లో ఉంటే ఇక భారత్ వైపు చైనా,,పాకిస్థాన్ లు ఇటువైపు చూడాలంటే వెనుకడుగు వేయాల్సిందేననే ధీమా వ్యక్తంచేస్తోంది రక్షణశాఖ..ప్రళయ్ క్షిపణులను ఛేధించటం అంత సులభం కాదని రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి..2015 లో భారత రక్షణ, పరిశోధనాభివృద్ధి సంస్థ (D.R.D.O) ప్రళయ్ క్షిపణులను అభివృద్ధి చేసింది..ఈ క్షిపణులు సరిహద్దులను శత్రు దుర్భేద్యంగా మార్చివేస్తాయి..ప్రళయ్ క్షిపణులు పేరుకు తగినట్లుగానే ప్రళయాన్ని సృష్టించగలవు.. శత్రు దేశాలు ప్రయోగించిన క్షిపణులను కూల్చేసే సామర్థం ఈ ప్రళయ్ క్షిపణులు సొంతం.. అవసరాన్నిబట్టి గాలిలోనే దిశను మార్చుకోగలిగే సామర్థ్యం ఈ ప్రళయ్ క్షిపణులకు వుంటుంది..350 నుంచి 700 కీలోల పేలోడ్ ను ఇవి మోసుకుని పోగలవు.. DRDO మిస్సైల్ గైడెన్స్ వ్యవస్థతో పాటు అత్యాధునిక సాంకేతికతను జోడించి ఈ ప్రళయ్ క్షిపణులను తయారు చేసింది..2020లోనే ఈ క్షిపణులను పరీక్షించిన భారత్ ఆర్మీ వీటి ఫలితాలపై సంతృప్తిని వ్యక్తం చేసింది..క్షిపణుల మోహరింపు పూర్తి అయిన తరువాత చైనా, పాక్ లకు సరిహద్దుల్లో భారత్ ధీటైన జవాబు ఇస్తుంది..