NATIONAL

వజ్రోత్సవ వేడుకలకు సిద్దమౌవుతున్న ఇంద్రప్రస్థ-పటిష్టమైన పోలీసు పహారా

అమరావతి: దేశ రాజధాని ఎర్రకోట వద్ద సోమవారం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించుకునేందుకు యావత్ భారత్ సన్నద్దమైంది..పాత కాలపు పోకడలను పక్కన పెడుతూ,నేటి యువత ఆలోచనలకు అనుగుణంగా న్యూ ఇండియా వైఖరి ఇదే అంటూ ఎలుగెత్తి చాటేందుకు,ఉక్కు పిడికిలితో కేంద్రం సిద్దమైంది….ఈ వజ్రోత్సవ వేడుకలను జీర్ణించుకులేని ఉగ్రమూకలు ఒక వైపు,,ప్రభుత్వంపై బురద చల్లెందుకు సిద్దంగా వున్న లూటీయన్ జర్నలిస్టులకు ధీటుగా సమాధాన ఇచ్చేందుకు కేంద్రం ధృడ సంకల్పంతో 76వ స్వాతంత్ర్య ఆగమనంకు ఆహ్వనంకు డిజిటల్ బాట సిద్దం చేసింది…ఈ నేపధ్యంలో…ఇంద్రప్రస్థలో భారతదేశ సారధి ఎర్రకోట నుంచి చేయనున్న ఉపన్యాసంకు ఎలాంటి అటంకాలకు లేకుండా చూసేందుకు ఢిల్లీ పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు….ఆ వివరాలు….ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ 9వ సారి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు….

ఎర్రకోట వద్ద అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు..10వేల మందికి పైగా పోలీసులతో అధికారులు ఎర్రకోట వద్ద భద్రతను ఏర్పాటు చేశారు..అలాగే చుట్టూ ఏం జరిగినా వెంటనే తెలిసేలా ఎర్రకోట చుట్టూ 1000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు..భద్రతా పర్యవేక్షణకు ఎర్రకోట వద్ద కంట్రోల్ రూమ్స్,,మొబైల్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు..100 పోలీసు వాహనాలు, పీసీఆర్ వ్యాన్‌లు, తక్షణ స్పందన బృందాల మోహరించారు..ఎర్రకోట పరిసరాల్లో షార్ప్ షూటర్స్, NSG స్నైపర్లు, ఎలైట్ స్వాట్ కమాండోలు, డాగ్ స్క్వార్డ్స్‌ను మోహరించారు..డ్రోన్ దాడులు జరగొచ్చన్న నేపథ్యంలో యాంటీ డ్రోన్ వ్యవస్థను కూడా DRDO ఏర్పాటు చేసింది..4 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్‌లను గుర్తించి, నియంత్రించ గల యాంటీ డ్రోన్ వ్యవస్థను ఎంతో వ్యూహాత్మకంగా భద్రతా అధికారులు ఏర్పాటు చేశారు..ఎర్రకోట చుట్టూ ఉన్న మొత్తం ఎనిమిది మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు..ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి సోమవారం ఉదయం 10 గంటలవరకు సెంట్రల్ ఢిల్లీలో ఈ ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయి..ఢిల్లీలో పారా గ్లైడింగ్, హాట్ ఎయిర్​బెలూన్, రిమోట్ పైలట్ ఎయిర్​క్రాఫ్ట్‌లపై ఆగస్టు 16 వరకు నిషేధం విధించారు..వందేళ్ళ స్వాతంత్ర్య భారత లక్ష్యాలు, ఆత్మ నిర్భర భారత్, దేశ అభివృద్ధి, రక్షణ, ఆరోగ్యం, వ్యవసాయం, రైల్వేలు, ఇధనం, క్రీడలు, సంక్షేమ పథకాలు, నూతన ఆవిష్కరణ వంటి అంశాలపై సోమవారం జెండా ఆవిష్కరించిన అనంతరం ప్రధాని సుదీర్ఘంగా ప్రసంగించనున్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *