HEALTH

ఇన్ ఫ్లూయెంజా A ఉపరకం H3N2 వైరస్- అవనసర యాంటీ బయోటిక్స్ వాడొద్దు

అమరావతి: దేశంలో ఇన్ ఫ్లూయెంజా A ఉపరకం H3N2 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది..వైరస్ బారిన పడితే అవనసర యాంటీ బయోటిక్స్ వాడొద్దని కోరింది.. H3N2 ఇన్ ఫ్లుయెంజా వైరస్ సబ్ వేరియంట్ అని కేంద్రం వెల్లడించింది.. పిల్లలు, అనారోగ్యాలతో బాధపడుతున్న వృద్ధులు ఈ H3N2 వైరస్  బారిన పడతారని వెల్లడించింది..ఈ వైరస్ భారత్ కు కొత్తకాదని, దేశంలో ప్రతి సంవత్సరం రెండు సార్లు దీని వ్యాప్తి కనిపిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది..కొన్నిసార్లు వైరస్ వ్యాప్తి వేగం అధికంగా ఉన్నప్పటికీ,, మార్చి చివరి నాటికి H3N2 కేసులు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.. చికిత్సకు సంబంధించిన నియమ నిబంధనలు కేంద్ర మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ (www.mohfw.nic.in) , NCDC (ncdc.gov.)లో కూడా అందుబాటులో ఉన్నాయి..ఈ వైరస్ నియంత్రణ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్స్ చేసిన  ఒసెల్టామివిర్ అనే టీకాను ఇవ్వాల్సి ఉంటుంది..ఈ వ్యాక్సిన్ ఔషధం పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ద్వారా ఉచితంగా అందుబాటులో ఉంది.. ఫిబ్రవరి 2017లో డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ షెడ్యూల్ హెచ్1 ప్రకారం ఒసెల్టామివిర్ అమ్మకానికి ప్రభుత్వం అనుమతించింది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *