DISTRICTS

సరోగసి కేంద్రాలో తనిఖీలు నిర్వహించాలి-కలెక్టర్ హరినారాయణన్

నెల్లూరు: జిల్లాలో నూతనంగా ఏర్పాటయ్యే ART, సరోగసి కేంద్రాలను సభ్యులందరూ సమిష్టిగా తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ ఆదేశించారు.శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ అధ్యక్షతన జిల్లాస్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ PC,,PNDT,ART, సరోగసి చట్టాలను జిల్లాలో సక్రమంగా అమలు చేయాలన్నారు. జిల్లాలో లింగ నిష్పత్తి ప్రతి వేయి మంది పురుషులకు 914 మంది స్త్రీలు ఉన్నందున, ఆకస్మిక తనిఖీలు చేసి లింగ నిర్ధారణకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నూతనంగా ఏర్పాటు చేసే ART, సరోగసి కేంద్రాలను సభ్యులందరూ సమిష్టిగా తనిఖీలు నిర్వహించి సవివరమైన నివేదికలు సమర్పించాలని ఆదేశించారు..కమిటీ సభ్యులైన జిల్లా మొదటి అదనపు జడ్జి జి.కబర్థి మాట్లాడుతూ స్కానింగ్ కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.జిల్లాలో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న ART క్లినిక్స్, సరోగసి క్లినిక్స్, స్కానింగ్ సెంటర్లు తదితర కేంద్రాలకు సంబంధించిన ప్రతిపాదనలను జిల్లా మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ ఆమోదం కొరకు ఇన్చార్జి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జి వెంకట ప్రసాద్ అందించారు.ఈ సమావేశంలో సభ్యులు Dr గీతా లక్ష్మి,NGO కవితా రెడ్డి, లీగల్ కన్సల్టెంట్ రూప, DSP శివాజీ రాజు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *