చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కు, రక్తదానం చేసిన వారికి ఇన్స్యూరెన్స్-తమిళసై

చిరు భద్రత..
హైదరాబాద్: రక్తదానం చేయడం చిన్న విషయం కాదని,బ్లడ్ బ్యాంక్ ద్వారా అనేక మందికి సేవ చేస్తున్న సినీనటుడు చిరంజీవికి తెలంగాణ గవర్నర్ తమిళి సై అభినందనలు తెలిపారు..అదివారం చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కు, రక్తదానం చేసిన దాతలను, 50 సార్లు,, అంతకంటే ఎక్కువసార్లు రక్తదానం చేసిన వారిని సన్మానించి,రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు.అంతే కాకుండా వారికి చిరు భద్రత పేరుతో ఇన్స్యూరెన్స్ పత్రాలు కూడా అందించారు..రాజ్ భవన్ తరపున రక్తదాన కార్యక్రమాలు చేపడుతున్నామని,, అవసరమైన వారికి సయమానికి రక్తం అందించేందుకు, ప్రత్యేకంగా ఓ యాప్ కూడా రూపొందించామన్నారు.. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కూడా అందులోని భాగం కావాలని గవర్నర్ తమిళి సై కోరారు..ఈ సందర్బంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ 1998లో రక్తం అందుబాటులో లేక చాలా మంది మరణించారని,ఆ ఘటన తనను తీవ్రంగా బాధించిందన్నారు.తన కోసం ఏం చేయడానికైనా అభిమానులు ఉన్నారని,, వారి ప్రేమను నలుగురికి ఉపయోగపడేలా మార్చాలనే ఉద్ధేశ్యంతో చిరంజీవి బ్లడ్ బ్యాక్ ప్రారంభించామని తెలిపారు. బ్లడ్ బ్యాంక్ ద్వారా 2 నుంచి 3 వేల మంది రక్తదానం చేస్తున్నారన్నారు..అలాంటి వారికి భద్రత ఇవ్వాలనే ఉద్ధేశ్యంతో చిరు భద్రత పేరుతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.