AMARAVATHIDISTRICTS

బుధవారం నీటి సరఫరాకు అంతరాయం-కమీషనర్

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని సమ్మర్ స్టోరేజ్ వద్ద ట్యాంకు క్లియర్ వాటర్ పంపింగ్ స్టేషన్ నుండి కొత్తూరుకు వెళ్లే పంపింగ్ మెయిన్ కు రంద్రం పడినందున ఎమ్మెస్ పైపులకు మరమ్మతులు చేస్తున్నందున బుధవారం కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ మంగళవారం తెలిపారు. కొత్తూరు పంపింగ్ స్టేషన్లో సెక్షన్ డెలివరీ పైపులు మార్చుటకు అత్యవసరంగా మరమ్మతులు చేపడుతున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం 8 గంటల నుండి 2 గంటల వరకు కొత్తూరు వన్, కొత్తూరు టు, శ్రీలంక కాలనీ, బుజబుజ నెల్లూరు, చంద్రబాబు నగర్, కిచర గుంట రిజర్వాయర్ల పరిధిలో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని తెలిపారు. కావున ఆ ప్రాంతప్రజలు ఆ సమయంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు. ఈనెల 23 వ తేదీన యధావిధిగా ఆయా ప్రాంతాల్లో నీటి సరఫరా చేయడం జరుగుతుందన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *