ఆర్మీ నియామకాల దరఖాస్తులకు ఆహ్వానం-కమిషనర్ జాహ్నవి

నెల్లూరు: సెప్టెంబర్ నెల 15 నుంచి 26వ తేదీ వరకు స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించనున్న భారత త్రివిధ దళాల్లో నియామకాలకు ఔత్సాహిక యువత నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ జాహ్నవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు..అగ్నిపథ్ పధకంలో భాగంగా భారత ఆర్మీ అథారిటీ వారి సూచనల మేరకు జిల్లాకు చెందిన యువత ఈనెల 5 నుంచి ఆగస్టు నెల 3వ తేదీ లోపు www.joinindianarmy.nic.in వెబ్సైట్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్, అగ్నివీర్ ట్రేడ్ మెన్ ఉద్యోగాలకు అభ్యర్థులు ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నాటికి 17 1/2 నుంచి 23 సంవత్సరాల వయసు మధ్య కలిగి ఉండాలని నియమాలు సూచిస్తున్నాయని కమిషనర్ పేర్కొన్నారు. పూర్తి వివరాలకు పైన సూచించిన వెబ్సైట్ ను సందర్శించి ఆన్లైన్ లో దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ కూడా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని కమిషనర్ పేర్కొన్నారు..