ఎమ్మెల్సీ ఓటర్ల నమోదులో అక్రమాలను అరికట్టాలి-మోహన్ రావు

నెల్లూరు: ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ లిస్టులో అనేక అక్రమాలు జరిగాయని,వాటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ మంగళవారం సిపిఐఎం జిల్లా కమిటీసభ్యులతో కలసి ఆధ్వర్యంలో డిఆర్ఓకి వినతి పత్రం సమర్పించడం జరిగిందని ఎన్నికల కమిటీ కన్వీనర్ మోహన్ రావు తెలిపారు.టీచర్ ఎమ్మెల్సీ అధికార పార్టీ అభ్యర్థి నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ విద్యాలయాలలోని ప్రైవేట్ బోధనా సిబ్బందిని అనర్హులైన వారిని ఓటర్లగా నమోదు చేయించడం జరిగిందని, వీటిని వెరిఫై చేయించేందుకు జిల్లా స్థాయి ఐఏఎస్ అధికారిని నియమించి వెరిఫికేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదులో బోగస్ సర్టిఫికెట్లతో నమోదు చేయించారని, ఈ బిఎల్వోలు సక్రమమైన వెరిఫికేషన్ లేకుండానే ఓటర్ లిస్టులో చేర్చారని వీటి పై విచారణ చేపట్టాలని కోరారు. అప్లై చేసిన ప్రతి ఓటరు అప్లికేషన్, ఇతర సర్టిఫికెట్లను వెబ్సైట్లో పెట్టాలని ,అప్పుడే వెరిఫికేషన్ సాధ్యమవుతుందని తెలియజేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి 2000 ఓట్ల నుంచి నాలుగు వేల ఓట్లు ఉన్నాయని ,ప్రతి 1000 ఓట్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. జిల్లా అధికార యంత్రాంగం మరియు ఎన్నికల కమిషన్ వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే అక్రమాలపై పెద్ద ఎత్తున ఆందోళనచేపడుతామని తెలియజేశారు .