జోషిమఠ్ ప్రాంతంలో విస్తుపోయే నిజాలకు సంబంధించిన ఫోటోలను విడుదల చేసిన ఇస్రో

అమరావతి: ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ ప్రాంతంకు సంబంధించి భారత అంతరిక్షణ పరిశోధన సంస్థ ‘ఇస్రో’ నమ్మలేని నిజాలను తెలిపే ఫోటోలను విడుదల చేసింది..జోషిమఠ్ ప్రాంతంలో భూమి కుంగుబాటు క్రమాన్ని వివరిస్తూ ఫోటోలు రిలీజ్ చేసింది..ఇస్రో విడుదల చేసిన ఫోటోలను విశ్లేషించిన జియాలజిస్టులు,,కేవలం 12 రోజుల వ్యవధిలోనే 5.4 సెంటీమీటిర్ల(c.m) మేర నేల కుంగిపోయినట్లు గుర్తించారు.. డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ మధ్య 5.4 సెంటిమీటర్లు కుంగిందని,, 2022 ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో 9 సెంటిమీటర్ల మేర కుంగిపోయినట్లు గుర్తించారు..భవిష్యత్‌తో జోషిమఠ్ ప్రాంతంలోని భూమి పూర్తిగా కుంగిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు..ప్రమాదం పొంచి వుండడంతో, జోషిమఠ్‌లో పగుళ్లు వచ్చిన భవనాల కూల్చివేత ప్రారంభమయ్యింది..తొలుత రెండు హోటళ్లను కూల్చివేసిన తరువాత హోటల్ యాజమానితో పాటు స్థానికులకు నచ్చచెప్పి మిగిలిన భవనాలను కూల్చివేసే ప్రక్రియ ప్రారంభించారు..పగుళ్లు వచ్చిన భవనాలను కూల్చివేయడానికి కనీసం 15 రోజుల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.. భవనాలను కూల్చివేతలకు బుల్‌డోజర్లు,,జెసిబీలను ఉపయోగిస్తున్నారు.