AMARAVATHITECHNOLOGY

36 OneWeb ఉపగ్రహాల వాణిజ్య ప్రయోగంకు సిద్దమౌతున్న ఇస్రో

అమరావతి: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ  ఇస్రో  రోదసీ వాణిజ్యంలో ఇస్రో మరో భారీ అడుగు వేసే దిశగా సన్నాహకాలు చేస్తొంది..ఈ నెల 26 షార్ నుంచి భారీ రాకెట్ ప్రయోగం చేపట్టనున్నారు..GSLV MARKతో LVM3-M3 మిషన్ ద్వారా UK దేశానికీ చెందిన 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపనునుంది..ఈ ప్రయోగం పూర్తి వాణిజ్య పరమైన రాకెట్ ప్రయోగం.. శాస్త్రవేత్తలు షార్ లోని 2వ వాహక ప్రయోగ వేదిక మీద నుండి ఈ LVM3-M3 రాకెట్ ప్రయోగం చేయనున్నారు..వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే  ఈనెల 26న ఆదివారం రాత్రి 9 గంటలకు ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది.. 5805 Kgలు బరువు కలిగి ఉన్న UK దేశానికి చెందిన 36 ఉపగ్రహాలను 450 Km ఎత్తులో ఉన్న Low Earth Orbit లోకి పంపనున్నది..ఈ ప్రయోగం విజయవంతం చేసి తద్వారా ఇస్రో రోదసీ వాణిజ్యంలో తనకంటూ స్థానం సృష్టించుకోనున్నది.. ఇస్రో వాణిజ్య విభాగం NSIL రెండు దశల్లో 72 ఉపగ్రహాలను ప్రయోగించడానికి 1,000 కోట్ల రూపాయలతో OneWebతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి విదితమే.. 36 One Web ఉపగ్రహాలను మొదటి బ్యాచ్‌ను క్రింద గత సంవత్సరం అక్టోబర్ 23న శ్రీహరికోట నుండి విజయవంతంగా ప్రయోగించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *