TECHNOLOGY

ఈ నెల 29న GTOలోకి నావిక్ ను పంపనున్నఇస్రో

అమరావతి: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) సోమవారం (29వ తేదిన) ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి ఉదయం 10-42 గంటలకు NVS-01 నావిగేషన్ శాటిలైట్‌ను ప్రయోగించనుంది..2,232Kgల బరువున్న NVS-01  నావిగేషన్ శాటిలైట్‌ని జియోసింక్రోనస్ ట్రాన్స్‌ ఫర్ ఆర్బిట్ (GTO)లోకి GSLV-F12 రాకెట్ ద్వారా పంపనున్నది.. నావిగేషన్‌ విత్‌ ఇండియన్‌ కాన్‌స్టలేషన్‌ (నావిక్‌) అవసరాల కోసం రూపొందించిన రెండోతరం ఉపగ్రహాల్లో NVS-01 మొదటిది.. Navik  అనే వ్యవస్థ,,అమెరికాకు చెందిన GPS తరహాలోనే భారత్‌ అభివృద్ధి చేసిన స్వదేశీ ఉపగ్రహ నావిగేషన్‌ వ్యవస్థ.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *