కేదారేశ్వరుని క్షేత్రం రక్షణకు ఐటీబీపీ జవాన్లు

అమరావతి: హిమగిరిల్లో కొలువై వున్న కేదార్‌నాథుడి పేరు తలుచుకుంటేనే ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.. సంవత్సరంలో 6 నెలలు గుడి తీసివుంటే,,మరో 6 నెలలు మూసి ఉండే ప్రసిద్ధ పుణ్య క్షేత్రం.. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత మైనస్ 15 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుంది..ఈ సంవత్సరం నుంచి కేదారేశ్వరుని గుడిని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసుల రక్షణలోకి వచ్చింది..మహారాష్ట్రకు చెందిన ‘లాకి’ కుటుంబం సౌజన్యంతో, కేదారేశ్వరుడి ఆలయంలోని అంతర్భంగాలో గర్బ గుడి గోడలు, నాలుగు స్తంభాలు, సీలింగ్‌కు 560 బంగారం రేకులు ఉపయోగించి తాపడం పూర్తి చేశారు..ఈ రేకుల తయారీలో 40 కిలోలకు పైగా బంగారం వాడారని అంచనా..ఈ కార్యక్రమం అక్టోబర్ 26 నాటికి ముగిసింది..బంగారం తాపడం కార్యక్రమంను ఆలయ పూజారులు దీన్ని వ్యతిరేకించినప్పటికీ ఆలయ బోర్డు ఈ ప్రక్రియను పూర్తిచేసింది..11,755 అడుగుల ఎత్తులో ఉన్న ఈ క్షేత్రంలో ఉష్ణోగ్రత అన్నికాలాల్లో కనిష్టంగా నమోదు అవుతుంది..శీతాకాలంలో కేదార్‌నాథ్ క్షేత్ర పరిసరాల్లో కురిసే మంచు 5 నుంచి 6 అడుగులమేరకు పేరుకుపోతుంది..శీతాకాలం ప్రారంభం అయిన తరువాత స్థానికులు మైదాన ప్రాంతాలకు వెళ్లిపోతారు..శీతాకాలం పూర్తయిన తర్వాత మళ్లీ తమ ఇళ్లకు చేరుకుంటారు.. శ్రీ భద్రీనాథ్, కేధార్‌నాథ్ ఆలయ కమిటీ ఛైర్మన్ అజేంద్ర అజయ్ విజ్ఞప్తి మేరకు ఆలయ రక్షణకు ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రెటరీ ఎస్ఎస్ సంధు, ఐటీబీపీ దళాన్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.. మంగళవారం నుంచి ఐటీబీపీ జవాన్లు తమ విధులు ప్రారంభించారు..షిప్టుకు ఇద్దరి వంతున 24 గంటలు ఐటీబీపి సిబ్బంది గుడి పరిసరాల్లో విధులు నిర్వహిస్తున్నారు..ఆలయం తిరిగి 2023 ఏప్రిల్ నెలలో తెరవబడుతుంది..