అమరావతి: అవినితికి పరకాష్టగా నాయకులు అనుకుంటే వారిని తలతన్నెరీతిలో ప్రభుత్వ అధికారులు వున్నరు అనడానికి ఎన్నో ఉదాంతలు వెలుగు చస్తూనే వున్నాయి..ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నగరంలో వెలుగుచూసిన ఓ ఆర్టీఓ అధికారి నిర్వాకమే నిదర్శనం. ఆర్థిక నేర విభాగం అధికారులు(EOW) ఆగష్టు(గురువారం) 18న జబల్‌పూర్ నగరంలోని రోడ్ ట్రాన్స్ పోర్టు(RTO) అధికారి సంతోష్ పాల్ ఇంట్లో ఆకస్మిక సోదాలు నిర్వహించారు..ఇంట్లోకి అడుగుపెట్టిన EOW అధికారుకు ఇంట్లోని వసతులు చూసి దిమ్మతిరిగిపోయింది..10 వేల చదరుపు అడుగుల్లో నిర్మించిన ఇంట్లో 5 స్టార్ హోటల్‌లోని ప్రతి సౌకర్యం అక్కడ కన్పించింది..సదరు ఆర్టీఓ ఇంట్లో, స్విమ్మింగ్ ఫూల్, ఖరీదైన బాత్‌టబ్, మినీ బార్, హోం థియేటర్, ఇంట్లోనే సంతోష్ పాల్‌కు ప్రత్యేకంగా ఆఫీస్ వసతి,ఇంద్రలోకంను తలతన్నె బెడ్ రూమ్ లాంటి అతి ఖరీదైన ఫర్మిచర్ లు దర్శనం ఇచ్చాయి..అధికారుల విచారణలో బయటపడిన విషయాలు ఏమిటి అంటే,,ఈ భార్యాభర్తలకు మొత్తం ఆరు సొంత ఇళ్లు,,ఒక ఫామ్ హౌస్,,అలాగే ఖరీదైన కారు,మరో SUV,,రెండు ఖరీదైన టూవీలర్లు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది.. సంతోష్ పాల్ భార్య లేఖా పాల్ కూడా అదే కార్యాలయంలో క్లర్క్ గా పనిచేస్తోంది..సంతోష్ పాల్,,అతని భార్య,అవినితిపై ఫిర్యాదులు అందడంతో అధికారులకు రంగంలోకి దిగారు..అలాగే అధికారులు జరిపిన సోదాల్లో రూ.16 లక్షల నగదు,, బంగారు ఆభరణాలు,,సిర్థాస్థి పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ఆర్థిక నేర విభాగం ఎస్పీ దేవేంద్ర సింగ్ రాజ్‌పుత్ తెలిపారు..ఆ భార్యాభర్తల జీతాలతో పోలిస్తే వారి ఆస్తులు 650 రెట్లు ఎక్కువగా ఉన్నాయని,,అవినీతి సొమ్ముతో విలాసవంతమైన జీవితం గడుపుతున్న ఈ భార్యాభర్తలపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమన్నారు..