అమరావతి: తీహార్ జైలులో వుంటూ,అక్కడ నుంచి కథ నడిపి వందల కోట్లను నొక్కేసిన సుఖేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో జాక్వెలిన్‌ని నిందితురాలిగా ఈడీ పరిగణిస్తూ,,జాక్వెలిన్ పేరును ఢీల్లీ కోర్టుకు సమర్పించిన సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌లో చేరుస్తూ..ఆమెను నిందితురాలిగా పేర్కొంది..
సుఖేష్ చంద్రశేఖర్ గురించి ముందుగానే జాక్వెలిన్‌కు తెలుసని అధికారులు స్పష్టం చేశారు..అతడు ఇప్పటివరకు ఆక్రమమార్గంలో సంపాదించిన నగదులో ఆమెకు భాగం ఉన్నట్లు గుర్తించారు..వీడియో కాల్స్ ద్వారా అతనితో జాక్వెలిన్ నిరంతరం టచ్‌లో ఉన్నట్లు కీలక సాక్షులు వాంగ్మూలాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు..సుఖేష్ సైతం జాక్వెలిన్‌కు బహుమతులు ఇచ్చినట్లు అంగీకరించాడు..గతంలో అతడి నుంచి జాక్వెలిన్ దాదాపు రూ.10 కోట్ల విలువైన బహుమతులు అందినట్లుగా రుజువైంది..మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ ఇప్పటివరకు ఆమెకు సంబంధించిన రూ.7 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసింది..
(రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్ల భార్య నుంచి స్పూఫ్ కాల్స్ ద్వారా రూ.215 వసూలు చేసినట్లు సుఖేష్ పై ఆరోపణలు వచ్చాయి..ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయం,,న్యాయశాఖ,,హోంశాఖకు సంబంధించిన అధికారిగా నటిస్తూ సదరు బాధితురాలి నుంచి అతను డబ్బులు వసూలు చేశాడు..ఆమె భర్తకు బెయిల్ ఇప్పిస్తానని,,తమ ఫార్మాస్యూటికల్ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తానని సుఖేష్ ఫోన్ కాల్స్‌లో చెప్పినట్లుగా ఈడీ ఆధారాలు సేకరించింది..)