ఏప్రిల్ లేక మే నెలలో ముందస్తు ఎన్నికలకు జగన్-సత్యకుమార్

అమరావతి: సీ.ఎం జగన్ 2023 ఏప్రిల్ లేక మే నెలలో ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నరని బీజెపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చెప్పారు.శుక్రవారం అయన మీడియాతో మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎమ్మేల్సీ ఎన్నికల్లో రూ100 కోట్లు ఖర్చు పెట్టి,వైసీపీ అభ్యర్దులను గెలిపించుకుని,సదరు ఫలితాలు చూపించి ముందుస్తుకు వెళ్లాతరన్నారు.రాష్ట్రంలో అభివృద్ది పనులు చేసేందుకు నిధులు లెక పోవడంతో,ప్రజల నుంచి వ్యతిరేకత పెరగడం ఇందుకు కారణమన్నారు.ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ది పథంలో నడిపించాలంటూ 2019లో ప్రజలు 151 సీట్లు కట్టపెడితే,సీ.ఎం జగన్ ప్రభుత్వం, పాలన పక్కన పెట్టి,గర్జనల పేరిట ప్రాంతాలు,ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తొందని అరోపించారు.బీసీల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు అబద్దపు ప్రచారాలు,ప్రకటనలు చేయడం శోచనీయమన్నారు.బీసీలకు సంబంధంలేని వివిధ రంగాలకు ప్రభుత్వం పెట్టిన ఖర్చలన్నింటిని బీసీల ఖాతాల్లో లెక్కలు చూపుతున్నరని విమర్శించారు.సంవత్సరానికి రూ.6 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మండిపడ్డారు.రాజకీయ వేదికలపై బీసీలు 50 నుంచి 60 శాతం వరకు అని చెపుతున్నరని,లబ్దిదారకు సంబంధించి 43.17 శాతం మాత్రమే అని ప్రభుత్వం నివేదికలో పొందుపర్చిందన్నారు.బీసీలకు జరుగుతున్న ఆన్యాయలను ప్రజలు గమనించాలని కోరారు.