అన్ని వ్యవస్థలను జగన్ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది-బాబు,పవన్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాలను ఆరాచకంగా మారిందని,,అన్ని వ్యవస్థలను జగన్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని,ప్రభుత్వం అనుసరిస్తూన్న ప్రజా వ్యతిరేక విధానలపై పోరాటం చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు అన్నారు.ఆదివారం ఉదయం హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో సమావేశం అయిన వీరిద్దరు,అనంతరం మీడియాతో మాట్లాడారు.ఏ.పిలో G.O N0-1ని తీసుకున వచ్చి ప్రతిపక్షలపై కక్ష్యసాధింపులకు జగన్ ప్రభుత్వం పాల్పపడుతుందని చంద్రబాబు మండిపడ్డారు..ప్రజాస్వామ్యంలో జరుగరానిదే జరుగుతొందన్నారు..విశాఖలో అంక్షలు పెట్టి పవన్ ను హింసించారని,,ఇప్పటంలో పవన్ సభకు స్థలం ఇచ్చినందుకు ఇళ్లను కూల్చివేశారని అన్నారు..విశాఖలో నన్ను కూడా అడ్డుకున్నారని,, G.O N0-1 పరిణామాలను ముందుగానే విశాఖలో చూశామన్నారు..వైసీపీ ఆరాచకలు పరకాష్టకు చేరుకున్నయన్నారు..
జనసేనాని పవన్ కళ్యాణ్:- ప్రతిపక్షాల హక్కులను ప్రభుత్వం కాలరాస్తొంది…వైసీపీ నేతలు ఎన్నో దారుణలు చేస్తున్నారు..ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్లకుండా,G.O N0-1 ని తీసుకు వచ్చారు…ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిషేధం అన్నారు..జగన్ పుట్టిన రోజున అవే వాడారు అని మండిపడ్డారు..వైసీపీకి ఒక రూల్,,ప్రతిపక్షాలకు ఒక రూల్ వుంటుందా ? ఇరిగేషన్ మంత్రికి పోలవరం గురించి తెలియదు ? వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని వైసీపీకి తెలుసు అని,,అందుకే కేసులు,గొడవలు,కుట్రలతో వైసీపీ విశ్వరూపం చూపిస్తొందని విమర్శించారు..అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనియ్యమంటూన్నా అని పవన్ చెప్పారు..రాజకీయ పొత్తులపై మాట్లడడానికి ఇది సరైన సమయం కాదన్నారు..ఎన్నికలు వచ్చినప్పుడు అన్ని విషయాలు తెలియచేస్తామన్నారు.