అమరావతి: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్‌కర్ (71) పేరును బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు..శనివారం బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశం జరిగిన అనంతరం ఆయన పేరును బీజెపీ జాతీయ అధ్యక్షడు జె.పి నడ్డా వెల్లడించారు..ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే తరపున బరిలో నిలిచిన జగదీప్ ధన్‌కర్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఉన్నారు..ఈ సమావేశంలో జేపీ నడ్డా, అమిత్‌షా, రాజ్‌నాథ్, గడ్కరీ, తదితరులు పాల్గొన్నారు..ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవికాలం ఆగష్టు 10వ తేదీతో ముగియనుంది..షెడ్యూల్ ప్రకారం.. ఆగష్టు 6వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగాలి.. నామినేషన్ల ఫైలింగ్‌కు తుది గడువు జులై 19వ తేదీతో ముగుస్తుంది..