అమరావతి: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో NDA అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగదీప్ ధన్‌ఖడ్ సోమవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు..రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న లోక్ సభ సెక్రెటరీ జనరల్ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్‌కు ఆయన నామినేషన్ పత్రాలు అందచేశారు..ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ, రామ్‌దాస్ అథవాలే పాల్గొన్నారు..ఈ సందర్బంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్ మాట్లాడుతూ దేశ ప్రజాస్వామ్య విలువలను పెంపొందించేందుకు నేను సర్వధ కృషి చేస్తానని పేర్కొన్నారు..తన లాంటి సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి ఈ అవకాశం వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదని,,నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియచేశారు..