ఐసీసీ ఫైనాన్స్ అండ్ కమర్షియల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్‌గా జై షా ఎన్నిక

ఐసీసీ ఛైర్మన్ గా గ్రెగ్..
అమరావతి: ఐసీసీ బోర్డుకు ఆర్దికంగా దన్నుగా నిలుస్తున్న బిసీసీఐను కీలకపదవి వరించింది. ఐసీసీ బోర్డులో కీలకమైన ఫైనాన్స్ అండ్ కమర్షియల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్‌గా జై షా ఎన్నికయ్యాడు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ లో జరిగిన ఐసీసీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సమావేశంలో ఐసీసీ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఐసీసీ నిర్వహించే వేల కోట్ల ఆర్థిక లావాదేవీలను ఫైనాన్స్ అండ్ కమర్షియల్ కమిటీ అఫైర్స్ పర్యవేక్షించనుంది. ఐసీసీ సభ్య దేశాల మధ్య ఆదాయ భాగస్వామ్యాన్ని నిర్దేశిస్తుంది. అలాగే ఏడాదిలో ఐసీసీ కుదుర్చుకున్న ఒప్పందాలు, వివిధ సిరీస్లు, టోర్నీలకు సంబంధించిన మెయిన్ స్పాన్సర్ షిప్ కాంట్రాక్టులను పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం జై షా బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. 2021 జనవరి 30 నుంచి ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నాడు.
ఐసీసీ ఛైర్మన్ గా గ్రెగ్:- ఐసీసీ ఛైర్మన్‌గా గ్రెగ్ బార్క్లే మళ్లీ ఎన్నికయ్యాడు. ఈ పదవి కోసం జింబాబ్వే క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ డాక్టర్ తవెంగ్వా ముకుహ్లాని పోటీ పడ్డాడు. గ్రెగ్ బార్క్లే కు బీసీసీఐ మద్దుతు వుండడంతో చివరి నిమిషంలో తవెంగ్వా చైర్మన్ రేసు నుంచి తప్పుకోవడంతో గ్రెగ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. ప్రస్తుతం గ్రెగ్ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్‌గా ఉన్నాడు. గ్రెగ్ ఈ పదవిలో మరో రెండేళ్ల పాటు కొనసాగుతాడు.