అయోధ్య రామమందిరంపై ఆత్మాహుతి దాడికి జైషే-ఇ-మహ్మద్ కుట్ర-ఐ.బీ హెచ్చరిక

అమరావతి: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భవ్య రామమందిరంపై,,రిపబ్లిక్ డే సందర్బంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేస్తున్నట్లు నిఘా సంస్థలు హెచ్చరికలు చేశాయి.. సోమవారం నిఘా వర్గాలు హెచ్చరికల్లో, అయోధ్య రామమందిరంపై ఉగ్రవాదులు రెక్కీ చేసినట్టు తెలిసింది…నేపాల్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించేందుకు టెర్రరిస్టులు ప్రయత్నిస్తునట్టు ఐబీ హెచ్చరికల్లో పేర్కొన్నట్లు సమాచారం…నిఘా వర్గాల హెచ్చరికల తరువాత అయోధ్యతో భద్రతను కట్టుదిట్టం చేశారు..సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారులు గట్టి నిఘాను ఏర్పాటు చేశారు.. ఇప్పటికే 50 శాతం ఆలయ నిర్మాణం పనులు పూర్తయిన నేపథ్యంలో ఇటీవలే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జనవరి సంక్రాంతికి అయోధ్య రామమందిర పనులు పూర్తి చేసుకుని,,రామ్ లాల్ దర్శనం ప్రారంభమవుతుందని ప్రకటించారు..