జమిలి ఎన్నికల నిర్వహణ అంశం, లా కమిషన్ పరిశీలనలో ఉంది-కేంద్ర మంత్రి రిజిజు

అమరావతి: లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న అంశంపై లా కమిషన్ పరిశీలనలో ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు..శుక్రవారం లోక్‌సభలో ఎంపీ భగీరథచౌదరి, జమిలి ఎన్నికల పై అడిగిన ప్రశ్నకు పై విధంగా మంత్రి రిజిజు సమాధానం ఇచ్చారు..అలాగే ఈ అంశంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల సంఘం సహా అనేక భాగస్వామ్య పక్షాలతో చర్చించినట్లు వెల్లడించారు..పాల్లమెంట్ స్టాండింగ్ కమిటీ తన నివేదికలో కొన్ని ప్రతిపాదనలు, సిఫార్సులు చేసిందని,,సదరు నివేదిక ఆధారంగా లా కమిషన్ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తూ ఒక ప్రణాళికను తయారు చేసే పనిలో నిమగ్నమైందని తెలిపారు.. తరచుగా వచ్చే ఎన్నికల నిర్వహణతో నిత్యావసర సేవలు సహా ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయని స్టాండింగ్ కమిటీ తన నివేదికలో పేర్కొందన్నారు..పార్లమెంటుకు,,రాష్ట్ర అసెంబ్లీలకు వేరువేరుగా జరిగే ఎన్నికల కారణంగా భారీగా ప్రజాధనం ఖర్చవుతుందని పేర్కొందని,,2014-22 మధ్యకాలంలో 50 అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయని స్టాండింగ్ కమిటీ తన నివేదికలో వివరించిందన్నారు..గడిచిన ఎనిమిది సంవత్సరాల్లో,, ఎన్నికల నిర్వహణ కోసం దాదాపు రూ.7వేల కోట్లకు పైగా ధనం ఖర్చు పెట్టాల్సి వచ్చిందని కిరణ్ రిజిజు పేర్కొన్నారు..