జనసేన, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూనే వుంది-మనుక్రాంత్

నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఆనాలోచిత నిర్ణయాలతో,ప్రజలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నరని,ప్రజల సమస్యలపై జనసేనాని పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నిరంతరం పోరాడుతూనే వున్నమని జనసేనపార్టీ నెల్లూరుజిల్లా పార్లమెంట్ నియెజకవర్గం అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి అన్నారు.శుక్రవారం నెల్లూరు పట్టణం పరిధిలో NTR నగర్ లో జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు పురస్కరించుకుని,,జనసేనపార్టీ జెండాను ఎగురవేశారు.ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ YSRCP City MLA అనిల్ కుమార్ పై నగర ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వుందని,,ఈవిషయంపై నుంచి ప్రజల దృష్టి మళ్లీచేందుకు,,అనిల్,,రూప్ కుమార్ ల మధ్య దూరం పెరిగిందంటూ డ్రామాలు అడుతున్నరని ఎద్దేవా చేశారు.అనంతరం మహిళలకు చీరలు అందచేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,,పట్టణ అధ్యక్షుడు సుజయ్ బాబు,,చిరంజీవి యివత రాష్ట్ర అధ్యక్షుడు కొట్టె.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.