నూతన కార్య నిర్వాహకుల నియామకం..
హైదరాబాద్: వచ్చే సంవత్సరం తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో పోటీకి జనసేన పార్టీ వ్యూహాలు సిద్దం చెస్తొంది. ఇందులో భాగంగా 32 నియోజకవర్గాల్లో నూతన కార్య నిర్వాహకుల నియామకం జరిగిందని ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.నూతన కమిటీల ఏర్పాటులో కొత్త వారికి అవకాశం కల్పించినట్లు వివరించింది. తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఇటీవల జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించిన అనంతరం పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసిందని ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ పేర్కొన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం పనిచేసిన వారికి అధికంగా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మొదటి దశలో 32 మందిని కార్యనిర్వాహకులుగా నియమించినట్లు తెలిపారు. వారి పేర్లను జనసేన పార్టీ ప్రకటించింది. పవన్ కల్యాణ్, అటు తెలంగాణలో,ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారానికి ‘వారాహి’ పేరుతో వాహనాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు.
తెలంగాణ సాధారణ ఎన్నికల్లో పోటీకి @JanaSenaParty కసరత్తు.
• 32 నియోజకవర్గాల్లో నూతన కార్య నిర్వాహకుల నియామకం
• నూతన కమిటీల ఏర్పాటులో కొత్త వారికి అవకాశం#JanaSenaTelangana pic.twitter.com/URGoEm8Pe0— 𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮 (@JSPTelangana) December 11, 2022