నెల్లూరు: నెల్లూరులోని కొంత మంది వైసీపీ ప్రజాప్రతినిధులకు పాలన వికేంద్రీకరణకు,అభివృద్ది వికేంద్రీకరణకు తేడా తెలియదని, వైసీపీ స్వార్ద పాలన వికేంద్రీకరణకు జనసేన పూర్తి వ్యతిరేకమని జనసేనపార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ అన్నారు.మంగళవారం పాలన వికేంద్రకరణకు వ్యతిరేకంగా జనసేన నగరంలోని గాంధీబొమ్మవద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది.ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ ప్రజలు కొరుకుంటుంది అభివృద్ది వికేంద్రీకరణ అని వైసీపీ నాయకులు తెలుకోవాలని హితవు పలికారు.ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కొట్టే.వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు సుదీప్ బాబు,కృష్ణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.