మూడురోజుల ఉత్తరాంధ్ర పర్యటన కోసం విశాఖపట్నంకు చేరుకున్న జనసేనాని

అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మూడు రోజుల ఉత్తరాంధ్ర పర్యటన బాగంగా శనివారం సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నారు.అదే సమయానికి అధికారపార్టీకి చెందిన మంత్రులు,నాయకులు విమానాశ్రయంకు చేరుకొవడంతో కొంత సేపు ఉద్రికత్త పరిస్థితి చోటు చేసుకుంది.వెంటనే పోలీసులు ఆప్రమత్తమై పరిస్థితిని కంట్రోల్ చేశారు.అనంతరం జనసేనాని పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు వేల సంఖ్యలో విశాఖ జిల్లా పార్టీ శ్రేణులు, వీర మహిళలు, జన సైనికులుఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.పవన్ కళ్యాణ్ ఎయిర్ పోర్టు నుంచి కారుపై నిలబడి అభిమానులకు పలకరిస్తూ ముందుకు సాగారు.విశాఖనగర వీధుల్లో ఇసుక వేస్తే రాలనంత జనం రోడ్లపై ఉండడంతో,పవన్ కాన్వయ్ నెమ్మదిగా సాగుతొంది.
అధికారపార్టీ అడుతున్న నాటకం:-మంత్రుల కార్లపై తమ పార్టీ కార్యకర్తలు దాడులు చేశారంటూ దుష్పచారం చేస్తున్నరంటూ జనసేన నాయకుడు నాదెండ్ల.మనోహర్ మండిపడ్డారు.తమ పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణలో వుంటారని,,ఈలాంటి దాడులు చేసే సంస్కృతిని జనసేన ఎప్పుడు ప్రొత్సహించదని,,దాడులు చేసే సంస్కృతి వైసీపీదే అని ఆరోపించారు.