అన్ని హంగులతో సిద్దమైన జనసేనాని వాహానం

అమరావతి: రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలో చేపట్టనున్న ప్రజాయాత్రకు, అన్ని హంగులకు కూడిన వాహనం తయారు అయ్యింది. ఈ వాహనంకు సంబంధించిన వీడియోను పవన్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు . ‘వారాహి’… రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్-అంటూ ప్రకటించారు. హైదరాబాద్ లో పవన్ వెహికిల్, ట్రయల్ రన్ ను పరిశీలించారు. వాహనానికి సంబంధించి పార్టీ నేత తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు ముఖ్య సూచనలు చేశారు.వాహనం సిద్దం చేస్తున్న టెక్నికల్ టీమ్ తోనూ పవన్ మాట్లాడారు.ఈ వాహనానికి పవన్ ఇంకా రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో వాహనంపై ఎలాంటి నెంబరు కనిపించలేదు. వాహనానికి వారాహి అనే పేరు పెట్టారు.వారాహి అంటే దుర్గాదేవి సప్త మాతృకల్లో ఒకరు…అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాల్లో ఉంది. ఆ సప్త మాతృకలు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించారని జనసేన లీడర్లు చెప్తున్నారు. ఆ ఆలోచనతోనే వాహనానికి వారాహి అని పేరు పెట్టినట్టు జనసేన పార్టీ ప్రకటించింది.
‘Varahi’ is ready for Election Battle! pic.twitter.com/LygtMrp95N
— Pawan Kalyan (@PawanKalyan) December 7, 2022