జనసేనానులు బలమైన పోరాటాలకు సిద్ధం కావాలి-పవన్

అమరావతి: వైసీపీ ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, విశాఖలో పోలీసులు అరెస్టు చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు జనసేన లీగల్ టీం అండగా ఉంటుందని జనసేనాని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. సోమవారం మంగళగిరిలోని పార్టీ కార్యాయలంలో నిర్వహించిన మీడిమా సమావేశంలో అయన మాట్లాడుతూ ప్రజల ప్రాథమిక హక్కులకు పోలీసులు గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు.115 మందికి పైగా అటెంటివ్ మర్డర్ కేస్ పెట్టారని, నాయనిపుణులతో చర్చించి కొంతమందికి స్టేషన్ బైల్ ఇప్పించగలిగామన్నారు. జనసేనానులు బలమైన పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. న్యాయపర అంశాల్లో జనసేన శ్రేణులను చైతన్యపరుస్తామని, ప్రజా సమస్యలపై మరింత బలంగా గొంతు వినిపించాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వారే కాలరాస్తే న్యాయపరంగా ఎదుర్కోడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.