అమరావతి: ఈ సంవత్సరం దీపావళి నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో Jio 5G సేవలు అందుబాటులోకి తీసుకుని రానున్నామని రిలయన్స్ అధినేత ప్రకటన చేశారు.రిలయన్స్ ఇండస్ట్రీస్ 45వ వార్షిక సాధారణ సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఇమ్మర్సివ్, ఇంటరాక్టివ్ మెటావర్స్ టెక్నాలజీ ద్వారా వార్షిక సాధారణ సమావేశంలో పాల్గొన్న ముఖేష్ అంబానీ Jio 5G సేవలపై ప్రకటన చేశారు.తొలుత ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై నగరాల్లో Jio 5G సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. ఆటు తరువాత క్రమంగా 2023 డిసెంబర్ నాటికి దేశంలోని ఇతర ప్రధాన నగరాలు, జిల్లాలు, మండలాలకు Jio 5G సేవలను విస్తరిస్తామని ప్రకటించారు.Jio స్టాండలోన్ 5G అని పిలువబడే 5G యొక్క తాజా వెర్షన్‌ను అమలు చేస్తుందని చెప్పారు.5జీ మౌలిక సదుపాయాలపై రూ.2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనుందని వెల్లడించారు.