AMARAVATHIMOVIE

జూనియర్ NTR,జాన్వీ కపూర్ జంటగా కొరటాల.శివ  దర్శకత్వంలో…

హైదరాబాద్: జూనియర్ NTR,దర్శకుడు కొరటాల.శివ  కాంబినేషన్ లో చిత్రికరణ జరుగనున్న మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోందని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు..పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న NTR 30పై భారీ అంచనాలు ఉన్నాయి..నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్  స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌,, యువ సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌ పై కొస‌రాజు హ‌రికృష్ణ‌,, సుధాక‌ర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..నేడు (మార్చి 6) జాన్వీ క‌పూర్ పుట్టిన‌రోజు. ఈ సందర్బంగా మేక‌ర్స్ ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టిస్తూ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు..ఈ నెల‌లోనే సినిమాను లాంఛ‌నంగా ప్రాంభించి షూటింగ్‌ను కూడా ప్రారంభిస్తారు.. 2024 ఏప్రిల్ 5న చిత్రం విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు..టాప్ టెక్నీషియ‌న్స్‌ గా పేరున్న సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ సాబు సిరిల్‌, ఎడిట‌ర్ శ్రీక‌ర ప్ర‌సాద్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు..సంగీత ద‌ర్శ‌కుడు అనిరుద్,ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *