50వ సీజేఐ ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ ధనంజయ్ వై.చంద్రచూడ్

అమరావతి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ్ వై.చంద్రచూడ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో సుప్రీమ్ కోర్టు 50వ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్‌తో ప్రమాణం చేయించారు. సీజేఐగా ఆయన 2024 నవంబరు 10 వరకు సేవాలు అందించనున్నారు.జస్టిస్ చంద్రచూడ్ సుప్రీంకోర్టులో చాలా కాలంగా పని చేస్తున్నారు.ప్రమాణస్వీకారం అనంతరం జస్టిస్ చంద్రచూడ్ మీడియాతో మాట్లాడుతూ, మాటలతో కాదు పని తీరుతోనే ప్రజలకు విశ్వాసం కల్పిస్తానన్నారు. టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకుంటామని, సుప్రీంకోర్టులో అన్ని అంశాల్లో సంస్కరణలు ప్రవేశ పెడతామన్నారు.జస్టిస్ ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ 1959 నవంబర్ 11న జన్మించారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి ఆర్థికశాస్త్రంలో BA ఆనర్స్ చేసారు. ఆటు తరువాత ఢిల్లీ యూనివర్సిటీలోని క్యాంపస్ లా సెంటర్ నుంచి LLB చేశారు.USAలోని హార్వర్డ్ లా స్కూల్ నుంచి ఫోరెన్సిక్ సైన్స్ లో LLM, డాక్టరేట్ పొందారు. చంద్రచూడ్ తండ్రి యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ దాదాపు 7 సంవత్సరాల నాలుగు నెలల పాటు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.ఇది సుప్రీంకోర్టు చరిత్రలో సుదీర్ఘమైన సీజేఐ పదవీకాలం.