x
Close
HYDERABAD POLITICS

కాళేశ్వరం ప్రాజెక్టు ఆ కుటుంబానికి ఏటీఎంలా మారింది-అమిత్ షా

కాళేశ్వరం ప్రాజెక్టు ఆ కుటుంబానికి ఏటీఎంలా మారింది-అమిత్ షా
  • PublishedAugust 21, 2022

హైదరాబాద్: ఒక కుటుంబానికి చెందిన పార్టీ పాలనతో రాష్ట్ర ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని,,ఫలితంగా రాష్ట్రం అప్పుల ఉబిలో కూరుకుని పోతుందని కేంద్ర హోంమంత్రి  అమిత్ షా మండిపడ్డారు..ఆదివారం మునుగోడులో నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ఆ కుటుంబానికి ఏటీఎంలా మారిందని ఆరోపించారు. పెట్రోల్ ధరలను ప్రధాని మోడీ ప్రభుత్వం రెండుసార్లు తగ్గించినా,,ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఒర పైసా తగ్గించలేదని గుర్తు చేశారు.. పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉందన్నారు..మోడీ ప్రభుత్వం రూ.2 లక్షల కోట్ల సాయం అందించినా తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలోనే ఎందుకుందని అమిత్ షా ప్రశ్నించారు.8 సంవత్సరాల పాలనలో కేవలం కేసీఆర్ కుటుంబానికి తప్ప యువతకు ఉపాధి దక్కలేదని అమిత్ షా వాపోయారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే,ఇతర రాష్ట్రాల్లాగే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుందన్నారు.తెలంగాణలో కమలం వికసించేలా చేయాల్సిన బాధ్యత మునుగోడు ప్రజల చేతుల్లోనే ఉందని చెప్పారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి:- టీఆర్ఎస్ ప్రభుత్వాని కూకటివేళ్లతో సహా పెకిలించేందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  బీజేపీలో చేరారని మంత్రి అమిత్ షా అన్నారు.కోమటిరెడ్డి రాజగోపాల్ పార్టీలో చేరిన సందర్భంగా నిర్వహించిన మునుగోడు సమరభేరిలో ఆయన పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ సర్థార్ వల్లభాయ్ పటేల్ చొరవతో రజాకార్ల కబంధ హస్తాల నుంచి తెలంగాణకు విముక్తి లభించిందన్నారు. మజ్లిస్ పార్టీకి భయపడే కేసీఆర్ ఆ హామీ అమలు చేయలేదని చెప్పారు..రాబోయే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ వ్యక్తి సీఎం కాబోతున్నారని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.కేసీఆర్ అండ్ కంపెనీ బూటకపు హామీలకు అంతులేదని,,ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క మాటను నిలబెట్టుకోలేదని విమర్శించారు.నిరుద్యోగులకు నెలనెలా రూ.3వేల భృతి, నల్గొండ జిల్లా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

 

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *