కండలేరు జలాశయ ముంపు బాధితుల ఉద్యోగాల ప్రక్రియ-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలోని కండలేరు జలాశయ ముంపు బాధితులకు సంబంధించి ఉద్యోగాల కల్పన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు ఆదేశించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో జిల్లాస్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న కండలేరు జలాశయ ముంపు బాధితుల ఉద్యోగాలకు సంబంధించి చేపట్టిన కార్యాచరణ, పునరావాస వివరాలను కలెక్టర్ కు కమిటీ సభ్యులు వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు భర్తీ ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని కమిటీ సభ్యులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కూర్మానాథ్, డిఆర్ఓ వెంకటనారాయణమ్మ, తెలుగుగంగ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ హరినారాయణ రెడ్డి, కలెక్టరేట్ ఏవో షఫీ మాలిక్ తదితరులు పాల్గొన్నారు.