హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ విజయదశమి సందర్బంగా తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) గా ఉన్న పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి (BRS) గా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. TRSను BRSగా మారుస్తూ పార్టీ కార్యవర్గం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులందరూ ఆమోదించారు. దీంతో మధ్యాహ్నం BRS పార్టీ పేరును సీఎం KCR ప్రకటించారు.అనంతరం పార్టీ పేరులో మార్పు చేయాలని కోరుతూ ఎన్నికల సంఘానికి సమర్పించనున్న దరఖాస్తు పత్రాలపై సంతకాలు చేశారు. సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన సీఎం KCR,, BRS పార్టీ ఆవిర్భవించిందని ప్రకటించారు.21 ఏళ్ల TRS ప్రస్థానంలో దీన్ని కీలక మలుపుగా అభివర్ణించారు. సమావేశానికి హాజరైన పలు రాష్ట్రాల నేతల సమక్షంలో KCR ఈ ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో జనతాదళ్ (S) నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కూడా పాల్గొన్నారు.