NATIONAL

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అవినితి భాగొతంలో KCR కుమారై కవిత మధ్యవర్తిత్వం

అమరావతి: ఢిల్లీ ఉపమంత్రి,అప్ పార్టీ ముఖ్యనేత,సిసోడియాపై శనివారం సిబీఐ ఎక్సైజ్ పాలసీపై వచ్చిన ఆరోపణలపై దాడులు నిర్వహించిన నేపధ్యంలో….ఈ కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబ సభ్యులపై బీజేపీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు సంచలన ఆరోపణలు చేశారు..ఢిల్లీ ఒబేరాయ్ హోటల్‌లో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన జరిగిందని,,డబ్బు ఇవ్వడం,,తీసుకోవడంలో కేసీఆర్ కుమార్తె,, ఎమ్మెల్సీ కవిత కీలక పాత్ర పోషించారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా ఆరోపించారు..ఢిల్లీ డిప్యూటీ సిఎం,, ఎక్సైజ్ కమిషనర్,, అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో కవిత, దక్షిణాదికి చెందిన లిక్కర్ ప్రతినిధులు ఒక ఒప్పందకు వచ్చారని అన్నారు..ఒబెరాయ్ హోటల్‌లో కవిత మీటింగ్ ఏర్పాటు చేసి,చద్దా పరివార్ నుంచి డబ్బులు తీసుకుని పంజాబ్‌లో మద్యం ఫ్యాక్టరీని రీ ఓపెన్ చేయించారని ఆరోపించారు. లిక్కర్ పాలసీలో అవినీతి,,ఒబెరాయ్ హోటల్ నుంచే ప్రారంభమైందని, మూడు కోట్ల రూపాయలు క్యాష్ రూపంలో ఇచ్చారని చెప్పారు.అలాగే 1.5 కోట్ల రూపాయలు క్రెడిట్ రూపంలో అందించే ప్రయత్నం చేశారని మంజిందర్ సింగ్ సిర్సా ఆరోపించారు..అప్పటి వరకు 2 శాతం ఉన్న కమిషన్‌ను, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ 12 శాతానికి పెంచారని సిర్సా పేర్కొన్నారు..

కేసీఆర్ కుటుంబ సభ్యులు,,ఢిల్లీ N 1 లైసెన్స్ వున్న వ్యక్తుల ద్వారా కుదిరిన డీల్‌‌లో భాగంగా మనీశ్ సిసోడియాకు 150 కోట్ల రూపాయల ముడుపులు అందచేశారని బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ ఆరోపించారు..ఇందుకు బదులుగా ముందుగా N 1 సంస్థ ద్వారా వచ్చే కమిషన్, లాభాలు తీసుకునేలా డీల్ కుదిరిందన్నారు. పంజాబ్, తెలంగాణ, పశ్చిమ్ బెంగాల్‌లో ఢిల్లీ తరహా లిక్కర్ పాలసీ అమలు అవుతోందని పర్వేశ్ సాహిబ్ సింగ్ తెలిపారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *