HYDERABAD

పాలిచ్చే అవులా కాళేశ్వరం ప్రాజెక్టును కేసిఆర్ వాడుకున్నాడు-షెకావత్

యాదగిరి నరసింహుడిని..

హైదరాబాద్: యాదగిరిగుట్టలోని వంగపల్లిలో మంగళవారం ప్రజాసంగ్రామయాత్ర బహిరంగ సభ ముగిసింది..అనంతరం కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కాషాయ జెండా ఊపి బండి సంజయ్ 3వ విడత పాదయాత్రను ప్రారంభించారు.. బహిరంగ సభలో షేకావత్ మాట్లాడుతూ  కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ జాతీయ హోదా ఇవ్వాలని కెసిఆర్ అడుగుతుంటే మోడీ ఎందుకు ఇవ్వడం లేదని మీడియా వాళ్ళు నన్ను అడిగారు.. కాళేశ్వరం  ప్రాజెక్టుకు సంబందించిన మూడు ఆనకట్టలు మునిగిపోయాయి..అండర్ గ్రౌండ్ లో ఉన్న పంప్ హౌస్ మునిగిపోయింది.. కాళేశ్వరం ప్రాజెక్టును తప్పుడు డిజైన్ తో నిర్మించారు..ఇంజినీరింగ్  లోపముంది. సరైన ప్లానింగ్ లేకపోవడంవల్ల ప్రాజెక్టు ముంపుకి గురైంది..పైగా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇన్వెస్టమెంట్ క్లియరెన్స్, పర్యావరణ,,మరే ఇతర  అనుమతులు లేవు.. పైసలు దండుకునే యంత్రం (ATM) మాదిరిగా, పాలిచ్చే అవులా కాళేశ్వరం ప్రాజెక్టును మార్చుకున్నారు.. అంతేకాకుండా వాళ్ళ( రాష్ట్ర ప్రభుత్వ) వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై నెపం నెడుతున్నారు..కేసీఆర్ అక్రమ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అడుగుతున్నారు..అదెలా సాధ్యం? జాతీయ హోదా ఇస్తే మేము తప్పుచేసినట్లు అయ్యేది. జరిగిన తప్పులకు కేసీఆర్ బాధ్యత వహించాల్సిందే..అంటూ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు..అంతకు ముందు సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో ఏం పీకాడని కేసీఆర్ ఢిల్లీ వెళ్ళాడు? కేసీఆర్ ఢిల్లీ ఎందుకు పోయాడో తెలుసా? బ్రాండెడ్ మందు కొనుగొలు చేసేందకే? చికోటి ప్రవీణ్  దొంగ దందాతో TRS నేతలు ఎందుకున్నారో చెప్పాలి..గ్యాంగ్ స్టార్ నయీమ్ దోచుకున్న ఆస్తులు,ఆయన ఎన్ కౌంటర్ తర్వాత ఎక్కడకు పోయాయి? అంటూ చెప్పాలంటూ నిలదీశారు..

Spread the love
venkat seelam

Recent Posts

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…

16 hours ago

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

19 hours ago

డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదలీ వేటు

అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…

19 hours ago

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ కు 8వ తేదీ వరకు ఓటింగ్‌కు అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్‌ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ…

20 hours ago

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

2 days ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

2 days ago

This website uses cookies.