x
Close
AMARAVATHI DISTRICTS

18 ఏళ్లు రహస్యంగా ఉంచారు,నన్ను మీ కొడుకుగా గుర్తించండి-మేకపాటి.శివచరణ్ రెడ్డి

18 ఏళ్లు రహస్యంగా ఉంచారు,నన్ను మీ కొడుకుగా గుర్తించండి-మేకపాటి.శివచరణ్ రెడ్డి
  • PublishedJanuary 7, 2023

నెల్లూరు: ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి.చంద్రశేఖర్‌ రెడ్డి కుటుంబంలో ఒక్కసారిగా ఆలజడి మొదలైంది..తాను చంద్రశేఖర్‌ రెడ్డి కుమారుడిని అంటూ మేకపాటి శివచరన్‌ రెడ్డి రాసిన బహిరంగ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తొంది..18 ఏళ్లు రహస్యంగా ఉంచి మమ్మల్ని విడిచిపెట్టేశారు అంటూ మేకపాటి శివచరణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి..తనకు కుమారుడు లేడంటూ చంద్రశేఖర్ రెడ్డి చేసిన ప్రకటనకు,,స్పందనగా శివచరణ్‌ రెడ్డి, ఈ లేఖను,,చిన్ననాటి ఫొటోలను కొన్ని విడుదల చేశారు..ఆ లేఖలో అయన ఇలా రాసుకొచ్చారు….నా జీవితంలో అన్ని ముఖ్యమైన సంఘటనల్లో మిమ్మల్ని మిస్‌ అయ్యాను, నాకు జన్మనివ్వమని నేను మిమ్మల్ని అడగలేదు. నేను మీ బాధ్యత..14 ఏళ్ల వయసులో మీరు మమ్మల్ని విడిచిపెట్టిన తర్వాత నేను మీ హృదయంలో నా స్థానాన్ని అర్థం చేసుకున్నాను..అందుకే నేను మిమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు..నా చదువుకు ఫీజులు చెల్లించడంతో తండ్రిగా మీ బాధ్యత పూర్తి కాలేదు..మీరు నా తల్లితో 18 ఏళ్లు కలిసి జీవించి,, విడిచిపెట్టారు..మీరు, మమ్మల్ని ఎప్పుడూ రహస్యంగా ఉంచారు…నేను, మీ సంపద లేదా రాజకీయ వారసత్వం కోసం మీ వెనక నేను లేను..దయచేసి నన్ను మీ కుమారుడిగా గుర్తించండి..ఇది మీరు పూర్తి చేయాల్సిన బాధ్యత… ప్రస్తుతం నేను ఎందుకు బయటకు వచ్చానంటే,,ఒక ఇంటర్వ్యూలో మీకు మగ పిల్లలు లేరన్నారు.. మరి నేనవరిని..? నేను మీ కొడుకుని…నన్ను,,నా బాధను గుర్తించండి అంటూ లేఖలో పేర్కొన్నారు..దీంతో ఈ లేఖ తీవ్ర చర్చకు దారి తీసింది..శివచరణ్‌ రెడ్డి విడుదల చేసిన లేఖ,,ఫొటోలపై వైసీపీ ఎమ్మేల్యే మేకపాటి.చంద్రశేఖర్‌ రెడ్డి ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు..మరి శివచరణ్‌ రెడ్డి విడుదల చేసిన ఫోటో,లేఖకు ఎలాంటి సమాధానం వస్తుందొ వేచి చూడాలి..

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.