ఉత్సహాంగా సాగుతున్న ఖైరతాబాద్ పంచముఖ మహాలక్ష్మీ గణేషుడి శోభాయాత్ర

హైదరాబాద్: ఖైరతాబాద్ పంచముఖ మహాలక్ష్మీ గణేషుడి శోభాయాత్ర శుక్రవారం ప్రారంభమైంది..ఈసారి 50 అడుగుల ఎత్తు,,బంక మన్నుతో రూపొందించిన మహాగణపతి హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి తరలి వెళుతున్నాడు..50 అడుగుల భారీ మట్టి మహాగణపతిని ఊరేగింపుగా నిమజ్జనం చేయడం ఇదే మొదటిసారి.. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతి బరువు 60 నుంచి 70 టన్నులకు చేరింది..మహాగణపతిని సాగర తీరానికి ప్రత్యేక వాహనంపై తరలిస్తున్నారు..ఖైరతాబాద్ మండపం నుంచి ప్రారంభమయ్యే మహాగణపతి శోభాయాత్ర సెన్షేషన్ థియేటర్ ముందు నుంచి రాజ్ దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఎక్బాల్ మినార్ చౌరస్తా, తెలుగుతల్లి చౌరస్తా నుంచి లుంబినీ పార్క్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెం-4 వద్దకు చేరుకుంటుంది..ఎన్టీఆర్ మార్గ్‌లో క్రేన్ నెంబర్-4 వద్దకు మహాగణపతి చేరుకోగానే వెల్డింగ్ ఫ్రేమ్స్ ను తొలగిస్తారు.. చివరి ఘట్టం పూజల అనంతరం సాయంత్రానికి సాగర్‌లో మహా గణపతి నిమజ్జనం పూర్తవుతుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.మరో వైపు నగరంలో వర్షం భక్తులను ఇబ్బంది పెడుతునే వుంది..