ఢిల్లీలో కేంద్రం హోంశాఖ..
హైదాబాద్: కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి.రాజగోపాల్ రెడ్డి మంత్రి అమిత్ షాను కలిశారు..బీజేపీ జాతీయ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామితో కలిసి రాజగోపాల్ రెడ్డి అమిత్ షాతో భేటీ అయ్యారు..బీజేపీలో చేరిక, మునుగోడులో బహిరంగ సభ ఏర్పాటు అంశంపై ముగ్గురు నేతలు చర్చించినట్లు సమచారం..ఢిల్లీ పర్యటనలో భాగంగా రాజగోపాల్ రెడ్డి బీజేపీకి చెందిన ఇతర నేతలను కూడా కలవనున్నట్లు తెలుస్తోంది..కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన రాజగోపాల్,,ఈ నెల 8వ తేదిన స్పీకర్ ను కలిసి MLA పదవికి సంబంధించి రాజీనామా లేఖ అందజేయనున్నారు.