పడవలపై సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తూన్న కోనసీమ ప్రజలు

అమరావతి: గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి వరద పోటెత్తింది.. ధవళేశ్వరం వద్ద నీటి ప్రవాహం అంతకంతకు పెరిగుతొంది..అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు..సముద్రంలోకి 13 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు..భారీగా వరదనీరు విడుదల కావడంతో బ్యారేజీకి దిగువనున్న లంక గ్రామాల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి..గోదావరి ఉద్ధృతితో కోనసీమ జిల్లాలోని గ్రామ ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు..కొన్ని గ్రామాల ప్రజలు పడవలపై సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు..
మరో రెండు రోజులు:- బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడినట్లు వాతావరణ శాఖ పేర్కొంది.. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని,, రాజస్థాన్ జైసల్మేర్ వరకు క్రియాశీలకంగా నైరుతి రుతుపవనాల ద్రోణి కొనసాగుతోందన్నారు.. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు..మరో రెండ్రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖాధికారులు సూచించారు..