x
Close
DISTRICTS POLITICS

కుప్పంలో సొంత ఇల్లు లేదు కాని హైదరాబాద్ లో ఇంద్రభవనంలాంటి ఇల్లు కట్టుకున్నాడు-సీ.ఎం జగన్

కుప్పంలో సొంత ఇల్లు లేదు కాని హైదరాబాద్ లో ఇంద్రభవనంలాంటి ఇల్లు కట్టుకున్నాడు-సీ.ఎం జగన్
  • PublishedSeptember 23, 2022

చిత్తూరు: మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో దాదాపు 33 ఏళ్లు కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు పనిచేశారని, అలాంటి వ్యక్తి కుప్పం నుంచి తనకు కావాల్సింది తీసుకున్నాడే తప్ప చేసింది ఏమిలేదని ముఖ్యమంత్రి జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు..శుక్రవారం కుప్పం నియోజకవర్గంలోని అనిమిగానిపల్లి బహిరంగ సభలో మూడో విడత వైఎస్ఆర్ చేయూత నిధులను సీ.ఎం జగన్ విడుదల చేశారు. అనంతరం సీ.ఎం మాట్లాడుతూ, నాలుగు పథకాల ద్వారా రాష్ట్రంలోని మహిళలకు రూ.51వేల కోట్లు ఇచ్చామని, ఈ మూడు సంవత్సరాల్లో మహిళలకు రూ.1.17 లక్షల కోట్లు అందించామన్నారు. వచ్చే సంవత్సరం జనవరి నుంచి పింఛన్ ను రూ.2,750కి పెంచుతున్నామని తెలిపారు..కుప్పంను చంద్రబాబు ఏనాడూ సొంతగడ్డగా భావించలేదని, హైదరాబాదే ముద్దు అని భావించాడని జగన్ విమర్శించారు. అందుకే సీఎం అయ్యాక హైదరాబాద్ లో ఇంద్రభవనంలాంటి ఇల్లు కట్టుకున్నాడని, కుప్పంలో సొంత ఇల్లు కాదు కదా….ఓటు కూడా లేదని,,చంద్రబాబు హైదరాబాద్ కు లోకల్,, కుప్పంకు నాన్ లోకల్ అంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సీఎంగా ఉండికూడా తన సొంత నియోజకవర్గంలో కరువు సమస్యకు పరిష్కారం చూపించలేక పోయాడంటూ మండిపడ్డారు..కుప్పానికి ఏమీ చేయలేని చేతకాని నాయకుడు చంద్రబాబు అంటూ జగన్ విమర్శించారు..2019 ఎన్నికల తర్వాత అన్ని ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేశామని, కుప్పం ప్రజలు బాబు అవినీతికి వ్యతిరేకంగా ఓటేశారని అన్నారు.వైసీపీ హయాంలో కుప్పాన్ని మున్సిపాలిటీ చేశామని, ఆరు నెలల్లో హాంద్రీనీవా పనులు పూర్తిచేశామని, ఈ ప్రాంత ప్రజలకు కలగా మిగిలిన ఆర్డీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.. ఈ మూడు సంవత్సరాల్లో కుప్పం నిజమైన అభివృద్ధిని చూసిందని, ఎమ్మెల్సీగా ఉంటూనే భరత్, నాచేత ఇన్ని మంచి పనులు చేయించాడని, భరత్ ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిని చేస్తానంటూ జగన్ చెప్పారు.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *