నెల్లూరు: శాప్ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా నెల్లూరు ఏ.సి సుబ్బారెడ్డి స్టేడియంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ కబడ్డీ పోటీలు ఫైనల్స్ ఆదివారం జరిగాయి..ఫైనల్స్ లో 40-31 పాయింట్ల తేడాతో నెల్లూరు జట్టు పై కర్నూల్ జట్టు విజయం సాధించింది..ఈ పోటీల అనంతరం జరిగిన ముగింపు కార్యక్రమంలో మొదటి, ద్వితీయ,తృతీయ స్థానంలో గెలిచిన జట్లకు నిర్మలా ఏజెన్సీ అధినేత నరసింహారెడ్డి,,హైటెక్ ఫార్మా అధినేత N.V.రమణారెడ్డి,,జిల్లా క్రీడాప్రాధికార సంస్థ చీఫ్ కోచ్ ఆర్.కె.యతిరాజ్ లు బహుమతి ప్రధానం చేశారు..