హైదరాబాద్: పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ‘హరి హర వీర మల్లు’ చిత్రం నుంచి లేటెస్ట్ అప్ డేట్ ను మేకర్స్ విడుదల చేశారు..బాలీవుడ్ నటుడు బాబీ డియోల్,,ఈ చారిత్రాత్మక చిత్రంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర పోషిస్తున్నారు. చిత్రీకరణలో పాల్గొనేందుకు హైదరాబాద్ కు చేరుకున్నారు. కీలకమైన ఈ షెడ్యూల్ కోసం ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి 17వ శతాబ్దానికి చెందిన భారీ దర్బార్ సెట్ ను రూపొందించారు. పవన్ కళ్యాణ్, బాబీ డియోల్ మధ్య వచ్చే కీలక సన్నివేశాలను ఈ దర్బార్ సెట్ లో చిత్రీకరించనున్నారు. హరి హర వీర మల్లు చిత్ర యూనిట్ ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో 40 రోజుల పాటు 900 మంది సిబ్బందితో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిన భారీ షెడ్యూల్‌ను ముగించారు. ఆ షూట్‌కు ముందు ప్రధాన తారాగణం,,సాంకేతిక నిపుణులతో ప్రత్యేక ప్రీ-షెడ్యూల్ వర్క్ షాప్ నిర్వహించారు..దర్శకుడు క్రిష్ ఆలోచనకు అనుగుణంగా, తోట తరణి మొఘల్ యుగాన్ని పునఃసృష్టి జరిగిందా అనే విధంగా సెట్స్ ను క్రియేట్ చేస్తున్నారు..ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళి వెండితెరపై గొప్ప అనుభూతిని పంచాలన్న ఉద్దేశంతో చిత్రం బృందం ప్రతి చిన్న అంశంపైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.