AMARAVATHINATIONAL

6వ విడత పోలింగ్‌ లో ఓటు హాక్కును వినియోగించుకుంటున్న నేతలు

అమరావతి: లోక్‌సభ ఎన్నికలకు 6వ విడత పోలింగ్‌ శనివారం ప్రారంభమైంది.. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగుతుంది..ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు.. సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు సైతం ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖర్‌ తన భార్య సుదేశ్‌ ధన్‌ఖర్‌తో కలిసి ఢిల్లీలోని ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటు హక్కు వినియోగించుకున్నారు..అదేవిధంగా రాష్ట్రపతి ద్రౌపదిముర్ము,,కాంగ్రెస్‌ పార్టీ నేతలు సోనియాగాంధీ రాహుల్‌ గాంధీతోపాటు ప్రియాంక గాంధీ, ప్రియాంక పిల్లలు రైహాన్‌ రాజీవ్‌ వాద్రా, మిరయా వాద్రా, ఢిల్లీ మంత్రులు అతిశీ, సౌరభ్‌ భరద్వాజ్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌ ఢిల్లీలో ఓటు వేశారు..దేశంలోని 6 రాష్ట్రాలు,, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్‌ జరుగుతొంది..కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగియనుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *