NATIONAL

లియోనార్డో,ఓ సారి కజిరంగ పార్క్‌ ను మీరు సందర్శించాలి-అస్సాం సీ.ఎం హిమంత బిశ్వ శర్మ

అమరావతి: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియోను అస్సాంలోని కజిరంగా నేషనల్‌ పార్క్‌ ను సందర్శించాలని ఆహ్వానించారు..ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సంబంధిత అంశాలపై డికాప్రియో తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు..ఇటీవల ఆయన అంతరించే దశలో ఉన్న ఒంటికొమ్ము ఖడ్గమృగాల గురించి ప్రస్తావిస్తూ, వాటి పరిరక్షణ కోసం అస్సాం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు.. ‘‘2000 నుంచి 2021 మధ్యకాలంలో 190 ఖడ్గమృగాలను కొమ్ముల కోసం చంపేశారు..కజిరంగా నేషనల్ పార్క్‌ లో వాటిని వేటాడకుండా చూసేందుకు 2021లో అస్సాం ప్రభుత్వం చర్యలు తీసుకుంది..2022లో ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా 1977 తరువాత, ఆ ప్రాంతంలో మొదటిసారి ఒక్క ఖడ్గమృగాన్ని కూడా వేటాడలేదు’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..డికాప్రియో పోస్ట్‌ పై అస్సాం సీఎం స్పందిస్తూ, ‘‘వన్యప్రాణులను రక్షించుకోవడం అంటే మన సంస్కృతిని రక్షించుకున్నట్లేనని తెలిపారు..వాటి సంరక్షణకు తామంతా అంకితభావంతో పనిచేస్తున్నామని వెల్లడించారు..‘‘ డికాప్రియో.. మీకు మా కృతజ్ఞతలు..ఓ సారి కజిరంగ పార్క్‌ ను మీరు సందర్శించాలని ఆహ్వానిస్తున్నాం  అంటూ ట్వీట్ చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *