మద్యంపాలసీపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్

అమరావతి: ఢిల్లీలోని వివాదాస్పద కొత్త ఎక్సైజ్ పాలసీపై కేంద్ర దర్యాప్తు బృందం (CBI) విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సిఫార్సు చేశారు..సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం పాలసీ విధానంలో అవకతవకలను ఎత్తిచూపుతూ ఇటీవల ఓ నివేదిక బయటలకు వచ్చింది.. ఇందులో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పేరు కూడా ఇందులో ఉంది..నిజాలు తేల్చలాంటూ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సీబీఐ విచారణకు ప్రతిపాదించారు.. కొత్త ఎక్సైజ్ పాలసీద్వారా కొందరికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతున్నాయని నివేదికలో పేర్కొన్నారు..ఇందుకు సంబంధించిన నిర్ణయాలను మనీశ్ సిసోడియానే తీసుకున్నారని అన్నారు..కొత్త ఎక్సైజ్ పాలసీని గత సంవత్సరం నవంబరు 17 తీసుకోగా,,ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్నారు..సీబీఐ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా చేసిన ప్రతిపాదనలపై కేజ్రీవాల్ మండిపడ్డారు..