లైగర్-పట్టు కొల్పొయిన పూరీ ?

విడుదల…
అమరావతి: పాన్ ఇండియా మూవీ అంటూ ఇటీవల టాలీవుడ్ ఏ డైరెక్టర్ ను పలకరించిన చెప్పే స్టోరీ..లైగర్ మూవీ ఆస్థాయిలో పేరు తెచ్చుకోలేక పోయిందని కామెంట్స్ వస్తున్నాయి.ఇందుకు తగ్గట్టుగానే,సినిమా కథనం నడిచింది.హీరో లేక డైరెక్టర్ ను చూసి,సినిమా హల్స్ కు పరుగులు తీసే రోజులు పోయాయి..కథలో బలం,కథకు తగ్గటూ కథనం నడిపిస్తేనే,సినిమా అడుతుంది అనేందుకు ఇటీవల విడుదల అయిన సీతారామం ఉదహరణ.
ఇక లైగర్ విషయంలోకి వస్తే,,సర్వసాధారణంగా జరిగే కథే…బాలామణి (రమ్య కృష్ణ),,కొడుకు లైగర్ (విజయ్ దేవరకొండ) కరీంనగర్ నివాసులు. లైగర్ మార్షల్ ఆర్ట్స్‌లో జాతీయ ఛాంపియన్‌గా చూడాలనేది బాలామణి కోరిక. అదే లైగర్ కల కూడా..వారి కలలను నిజం చేసుకునేందుకు తల్లీ కొడుకులిద్దరూ ముంబైకి చేరుకుంటారు..ఒక మంచి కోచ్ ఆధ్వర్యంలో లైగర్ శిక్షణ ప్రారంభిస్తాడు..హిరోయిన్,,తానియా (అనన్య పాండే)తో ప్రేమలో పడ్డాక కొంత పరధ్యానంలో పడతాడు హిరో… బాలామణి లైగర్ అమ్మాయిలకు దూరంగా ఉండాలని, ప్రేమలో పడొద్దని హెచ్చరిస్తుంటుంది. ఈలాంటి సమయంలో ఈ జంట మధ్య ఎలాంటి సమస్యలు ఏర్పడ్డాయి? లాస్ వెగాస్‌లో జరిగిన ప్రపంచ MMA ఛాంపియన్‌షిప్ లో లైగార్ గెలిచాడా? జాతీయ ఛాంపియన్ నుంచి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళే నేపధ్యంలో ఎటువంటి అడ్డంకులు ఏర్పడ్డాయి? అనేదే కథ.
సినిమా ఆసక్తికరంగానే మొదలవుతుంది..డైరెక్టర్ నేరుగా కథలో వెళ్లడంతో,,పూరీ కథపై పట్టు సడకుండా చూస్తాడని ఉహించిన ప్రేక్షకులకు,,విజయ్,అనన్య పాండేల మధ్య ప్రేమ కథ విసుగు అన్పిస్తుంది..చాలావరకు సన్నివేశాలు ప్రేక్షకులు ఊహించినట్టే జరుగుతూ ఉంటాయి..ఇక సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కథ మరింత స్లో అయిపోతుంది. మైక్ టైసన్ పాత్ర,,అనన్య పాండేను కిడ్నాప్ చేయడం ఆ తరువాత క్లైమాక్స్ ఇవన్నీ ప్రేక్షకులను సహనాన్ని పరీక్షించే స్థాయిలో వున్నాయి..అంతర్జాతీయ స్థాయిలో ఒక వూపు వూపిన మైక్ టైసన్ పాత్ర,,పూరీలా…..తుస్సుమంది…అయితే టీవీ చానల్స్ వారికి వీలైనంతగా లైగర్ బరువును మోస్తు,,సినిమా హాల్స్ దగ్గర గొట్టాలు వూదుతూనే వున్నారు…ఏతా వాత తేలింది ఏమిటింటే….కథనంపై పూరీ పట్టు సడలింది..విజయ్ దేవరకొండ ఒదిగా వుండడం నేర్చుకొవాల్సిన అవసరం వుందేమో ??