ప్రపంచం జూడో చాంపియన్ లో స్వర్ణం సాధించిన లింతోయ్ చనంబం

అమరావతి: భారత జూడో ప్లేయర్ లింతోయ్ చనంబం 16 సంవత్సరాల వయస్సులోనే ప్రపంచం జూడో చాంపియన్గా అవతరించి చరిత్ర సృష్టించింది. సారాజెవోలో జరిగిన క్యాడెట్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 57 కిలోల విభాగంలో బ్రెజిల్‌కు చెందిన బియాంకా రీస్‌ను 1-0తో ఓడించి గోల్డ్ మెడల్ సాధించింది..దీంతో తొలిసారిగా స్వర్ణం సాధించిన ఏకైక భారత జూడో ప్లేయర్గా లింతోయ్ చనంబం చరిత్ర సృష్టించింది. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించిన మొట్టమొదటి భారత జూడో క్రీడాకారిణి లింతోయ్ కు SAI (స్పోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఇండియా) అభినందనలు తెలిపింది.. ఆసియా ఛాంపియన్ అయిన లింతోయ్..57 కిలోల విభాగంలో బ్రెజిల్‌కు చెందిన బియాంకా రీస్‌ను 1-0 తేడాతో ఓడించి క్యాడెట్ వరల్డ్ ఛాంపియన్ షిప్స్ 2022లో గెలుపొందింది ” అని SAI మీడియా ట్వీట్ చేసింది. లింతోయ్ చనంబం 2018లో సబ్-జూనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో తొలిసారి స్వర్ణం,,ఆటు తరువాత నవంబర్ 2021లో చండీగఢ్‌లో జరిగిన జాతీయ ఛాంపియన్‌షిప్‌లోనూ స్వర్ణం గెలుచుకోగా,,జూలై 2022లో జరిగిన ఆసియా క్యాడెట్, జూనియర్ జూడో ఛాంపియన్‌షిప్‌లలో మరో పసిడి పతకం దక్కించుకుంది.
HISTORY IS WRITTEN. 🇮🇳 IIS Judoka Linthoi Chanambam is India’s first ever Judo World Champion. ⚡️#CraftingVictories #India #Judo pic.twitter.com/oVTFaSOc5F
— Inspire Institute of Sport (@IIS_Vijayanagar) August 26, 2022