31వ తేది ఆర్దరాత్రి 1 గంట వరకు మద్యం విక్రయాలకు అనుమతి

హైదరాబాద్: పాత సంవత్సరంను వీడ్కొలు పలుకుతూ,కొత్త సంవత్సరంకు స్వాగతం పలికేందుకు నగరంలోని యువత పుల్ జోష్ తో సిద్దమౌవుతున్నారు.ఇందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం 31వ తేది ఆర్దరాత్రి 1 గంట వరకు మద్యం విక్రయాలకు ఎక్సైజ్ శాఖ అనుమతులు ఇచ్చింది..డిశంబరు 31 శనివారం కావడంతో,,ఆ రోజు ఆకాశమే హద్దుగా యువత చెలరేగిపోనున్నారు..పబ్స్, బార్లలో మైనర్లను అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేసింది..త్రీ స్టార్, ఫైవ్ స్టార్, పబ్బులు, క్లబ్బులకు పోలీసులశాఖ నిబంధనలు విడుదల చేసింది.రూల్స్ రిలీజ్ చేసింది. ఎంట్రీ, ఎగ్జిట్ దగ్గర సీసీ కెమెరాలు తప్పనిసరి ఉండాలని తెలిపింది..31 రాత్రి నుంచి జనవరి 1న ఉదయం వరకు నెక్లెస్ రోడ్,, పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రేస్ వే,, ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు పలు ప్లై ఓవర్లు మూసివేయనున్నారు.. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు తప్పని సరిగా సరైన ధ్రువీకరణ పత్రాలు చూపించేలా చర్యలు చేపట్టారు..మద్యం మత్తులో వాహనాలు నడిపినా,,ర్యాష్ డ్రైవింగ్, బైక్ లపై స్టంట్స్ చేసినా కేసులు నమోదు చేస్తామని సిటీ పోలీసులు హెచ్చరించారు.